చెట్టు కింద పులి.. కొమ్మలపై ఇద్దరు యువకులు.. గంటలపాటు సస్పెన్స్! - పులి నుంచి తప్పించుకున్న యువకులు
మధ్యప్రదేశ్ పన్నాలో ఇద్దరు యువకులు పులి బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. చెట్టుపైకి ఎక్కి, గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడే ఉన్నారు. పన్నా టైగర్ రిజర్వ్ లోపల ఉండే ఝలారియా మహాదేవ్ ఆలయానికి బయలుదేరిన వీరికి అకస్మాత్తుగా పులి కనిపించింది. దీంతో ప్రాణభయంతో బైక్ దిగిన వీరు సమీపంలోని చెట్టుపైకి ఎక్కారు. గుడికి వెళ్తున్న కొందరు భక్తులు ఈ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST