ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్.. 40 సార్లు ఆగిన ఊపిరి.. వైద్యులు ఏం చేశారంటే? - 40 సార్లు ఆగిన ఊపిరి
heart attack live video: ఛాతినొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ యువకుడు(25).. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. కుర్చీలో కూర్చున్న ఆ యువకుడు.. ఊపిరాడక కింద పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు చికిత్స అందించారు. గంటన్నర సమయంలో 40 సార్లు యువకుడి ఊపిరి ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. ఫిబ్రవరి 21న మధ్యప్రదేశ్లోని బైతుల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. క్రికెటర్ కూడా అయిన ఈ యువకుడికి గతకొద్దిరోజులుగా ఛాతి నొప్పి సమస్య తలెత్తింది. నొప్పిని పట్టించుకోకుండా ఇన్ని రోజులు చికిత్స తీసుకోలేదు. అయితే, ఫిబ్రవరి 21న ఉదయం ఛాతి నొప్పి వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో మరింత తీవ్రమైంది. దీంతో కుటుంబ సభ్యులు యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడిని కలిసే ముందు ఆస్పత్రిలో కూర్చున్న యువకుడు.. ఊపిరాడక కింద పడిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన వైద్యులు.. యువకుడి గుండె కండరాలు ఉత్తేజితమయ్యేలా 15-20 నిమిషాల పాటు సీపీఆర్ చేశారు. ఓ ఇంజెక్షన్, అనంతరం ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారు. చికిత్స కాస్త ఆలస్యమైనా.. యువకుడి ప్రాణాలు దక్కేవి కాదని వైద్యులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST