బంగారు కాంతుల్లో వెలుగులీనుతున్న యాదాద్రి - విద్యుత్ కాంతుల్లో యాదాద్రి
Yadadri Temple Drone Visuals: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వం, ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. బంగారు రంగు దీపాలతో సరికొత్త అందాలను సంతరించుకుని ఆలయ ప్రాంగణం మెరిసిపోతుంది. అంత పెద్ద ఆలయమూ స్వర్ణమయమై ధగధగా వెలిగిపోతుంటే... భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోతున్నారు. వేడుకల కోసం ఆలయాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు. మాఢ వీధులు, రాజగోపురాలు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST