వెయ్యి అడుగుల ఎత్తులో మహిళ.. బిక్కుబిక్కుమంటూ తీగకు వేలాడుతూ.. - nalanda latest news
బిహార్ నలంద జిల్లా రాజ్‌గీర్‌లో ఓ మహిళకు పెను ప్రమాదం తప్పింది. జిప్‌లైన్ ట్రెక్కింగ్ చేస్తున్న ఆమె 1000 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయింది. చాలాసేపు ఆమె అలానే బిక్కుబిక్కుమంటూ గడపగా.. కింద ఉన్నవారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు స్థానిక అధికారులు రంగంలోకి దిగి.. ఆమెను రక్షించారు. నేచర్ సఫారీ పార్క్‌లో జిప్‌లైన్ ట్రెక్కింగ్ చేస్తున్న ఆ మహిళ ఒక స్తంభం నుంచి మరొక స్తంభం వరకు దూసుకొచ్చింది. అయితే.. అక్కడ ఆమెను పక్కకు లాగి కిందకు దింపేందుకు సిబ్బంది ఎవరూ లేరు. ఫలితంగా.. స్తంభాన్ని ఢీకొట్టి మళ్లీ వెనక్కి వెళ్లిపోయిన ఆమె.. ఇలా గాల్లోనే ఉండిపోయింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST