అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన చిన్నారి.. వీడియో వైరల్! - ఉత్తరాఖండ్ పోల్స్
Child cast vote in uttarakhand: ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్లో ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో హల్ద్వానీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-59లో చిన్నారితో ఓటు వేయించాడు ఓ వ్యక్తి. సదరు వ్యక్తి తరఫున ఈవీఎంను ప్రెస్ చేశాడు ఓ బాలుడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో సదరు నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ అధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST