'కేంద్ర మంత్రి వస్తున్నా క్లీన్ చేయించరా?'.. వారిపై కిషన్ రెడ్డి ఫైర్ - G Kishan Reddy gwalior fort visit
మధ్యప్రదేశ్ గ్వాలియర్ పర్యటనకు వెళ్లిన కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్వాలియర్ కోట పరిసరాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం ఉండటాన్ని తప్పుబట్టారు. కేంద్రమంత్రి పర్యటనకు వస్తున్నారని తెలిసినా.. కోటను శుభ్రం చేయించకపోవడం ఏంటని మండిపడ్డారు. సరిపడా మానవ వనరులు లేకపోతే ఔట్సోర్సింగ్ విధానంలో పనులు చేయించలేరా అని అధికారులను నిలదీశారు. ఓ దశలో.. 'వెళ్లి చీపురు తీసుకురండి.. నేనే శుభ్రం చేస్తా' అన్నారు కిషన్ రెడ్డి. మంత్రి వ్యాఖ్యలతో కంగుతిన్న అధికారులు.. మౌనంగా చూస్తూ ఉండిపోయారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST