మహిళా సాధికారత కోసం ఫ్యాషన్ షో.. అలరించిన చిన్నారుల ర్యాంప్ వాక్ - నవసేన ఉమెన్ అండ్ సోషల్ వెల్పేర్ ట్రస్ట్ తాజా సమాచారం
Traditional Fashion Show: ఏపీలోని కాకినాడలో చిన్నారులు, యువతుల సంప్రదాయ ఫ్యాషన్ షో ఆహూతుల్ని అలరించింది. గిరిజన బాలికలు, వీధి బాలలు, మహిళా సాధికారిత కోసం నవసేన ఉమెన్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫ్యాషన్ షో నిర్వహించింది. చిన్నారులు, యువతులు సంప్రదాయ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మేయర్ సుంకర శివప్రసన్న పాల్గొన్నారు. ఈ సంస్థ ద్వారా ఐదేళ్లుగా 40మంది గిరిజన పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నామని నిర్వాహకురాలు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST