వేగంగా వచ్చి ఢీ కొట్టిన కారు.. ఐదడుగుల దూరంలో ఎగిరిపడిన యువకుడు - ఉత్తరాఖండ్ లేటస్ట్ న్యూస్
ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రపూర్ కిచ్చాలో జాతీయ రహదారిని దాటుతున్న ఓ యువకుడిని అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. కారు వేగంగా ఢీకొనడం వల్ల ఆ యువకుడు ఐదు అడుగుల దూరంలో ఎగిరి పడ్డాడు. ఘటన జరిగిన తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అటుగా వెళ్తున్న ఓ జవాన్.. యువకుడ్ని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తిని బరేలీకి చెందిన గోపాల్ ప్రజాపతిగా గుర్తించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.