వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు.. సెకన్లలో అదృశ్యం - ఉత్తరాఖండ్ లేటస్ట్ అప్డేట్స్
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ఓ యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సుమారు 6 గంటల సమయంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న భాక్రా వాగును దాటేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా పట్టు కోల్పోయి ప్రవాహంతోపాటే కొట్టుకుపోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం ఛర్యాల్ నాయక్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల పంకజ్ థాపా తన స్నేహితులతో కలిసి బన్సాయ్ అనే గ్రామానికి బైక్‌పై వెళ్లాడు. సుమారు ఆరుగంటల సమయంలో భాక్రా వాగును దాటేందుకు వారు ప్రయత్నిస్తుండగా, పంకజ్ వాగులో పడిపోయాడు. స్నేహితులు ఎంత ప్రయాత్నించినా అతన్ని కాపాడలేకపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మూడు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ యువకుడి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.