దొంగతనం నెపంతో యువకుడి దారుణ హత్య, కరెంట్ స్తంభానికి కట్టేసి మరీ
హరియాణా సోనీపత్‌లో దారుణం జరిగింది. దొంగతనం చేశాడన్న కారణంతో ఓ యువకుడిని కొట్టి చంపారు స్థానికులు. ఓ మొబైల్ షాపులో ఫోన్ చోరీ చేశాడని అనుమానించిన స్థానికులు యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన యువకుడు.. కాసేపటికి మరణించాడు. మృతుడిని ఝండ్పుర్ గ్రామానికి చెందిన అశోక్‌గా గుర్తించారు. మరో ఘటనలోనూ దొంగతనం నెపంతో యువకుడిని కొట్టారు ఐదుగురు దుండగులు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో జరిగింది. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.