విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్- తాగిన మైకంలో.. - అమృత్సర్ వార్తలు
పంజాబ్, అమృత్‌సర్‌లోని హకిమా వాలాలో 100 అడుగుల ఎత్తైన విద్యుత్తు టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. మాదకద్రవ్యాలకు బానిసై.. మతిస్తిమితం కోల్పోయిన ఆ యువకుడు విద్యుత్ టవర్ చివరిఅంచులకు ఎక్కి అధికారులను హడలెత్తించాడు. యువకుడిని కిందకి దించేందుకు స్థానికులు చేసిన యత్నాలు ఫలించకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. యువకుడు మద్యం మత్తులోనే టవర్ ఎక్కినట్లు పోలీసులు వెల్లడించారు.