డ్యామ్ గోడ ఎక్కి హీరో అవుదామని అనుకున్నాడు.. చివరకు ఆస్పత్రిలో... - srinivasa sagar dam news
Young Man Slipped From Dam Wall: కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్ జిల్లాలో ఉన్న శ్రీనివాస సాగర్ డ్యామ్ గోడ ఎక్కేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. అది కాస్తా బెడిసికొట్టి.. అందరూ చూస్తుండగానే జారి పడిపోయాడు. గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. యువకుడు జారిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిక్కబళ్లాపుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గౌరిబిదనూరు గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు.