టోల్గేట్ సిబ్బందితో 'ద గ్రేట్ ఖలీ' ఫైట్.. సెల్ఫీ కోసమేనట! - the great khali fight
రెజ్లర్ 'ద గ్రేట్ ఖలీ', టోల్గేట్ సిబ్బంది గొడవ పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. పంజాబ్ లూధియానాలోని లాడోవాల్ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెజ్లర్ ఖలీ తమను కొట్టాడని టోల్గేట్ సిబ్బంది ఆరోపించారు. అయితే.. అక్కడి సిబ్బందే తనను బెదిరిస్తున్నారని ఖలీ అన్నాడు. ఖలీతో సెల్ఫీ దిగే విషయంలో గొడవే దీనంతటికీ కారణమని తెలుస్తోంది.