తెలంగాణ

telangana

ETV Bharat / videos

గుండెపోటుతో రెజ్లర్​ మృతి.. వాకింగ్​ చేసి వస్తుండగా అక్కడికక్కడే.. - రెజ్లర్ మృతి

By

Published : Sep 28, 2022, 8:46 PM IST

వాకింగ్​ చేసి వస్తుండగా మార్గమధ్యలో గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ఓ యువ రెజ్లర్​ మృతి చెందిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. బెళగావి జిల్లాకు చెందిన యువ రెజ్లర్​ పైల్వాన్​ సంగప్ప(28).. ధార్వాడ్​లో స్థిరపడ్డాడు. బుధవారం ఉదయం మార్నింగ్​ వాక్​ ముగించుకుని తన స్నేహితుడితో ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో గుండెపోటు వచ్చి రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. అయితే అక్కడికక్కడే పైల్వాన్​ మరణించాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. పైల్వాన్​ సంగప్ప మరణంతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details