'ఐలవ్యూ' చెప్పాడని చితకబాదిన యువతి.. డ్రైనేజీ గొడవలో మహిళ గొంతు కోసి పరార్! - రాజస్థాన్ న్యూస్
రాజస్థాన్లోన్ జోధ్‌పుర్‌లో ఐలవ్యూ చెప్పిన వ్యక్తిని చితకబాదింది ఓ యువతి. స్కూటీపై యువతి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి ఆమెను ఆపాడు. కోపంతో ఆమె దుర్భాషలాడగా.. అతడు వెంటనే ఐలవ్యూ చెప్పాడు. ఆ మాట విన్న యువతి అతడ్ని చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. మరోవైపు, బిహార్‌లోని వైశాలిలో ఓ దారుణం జరిగింది. మోహియుద్దీన్‌పూర్ గరాహి పంచాయతీలో డ్రైనేజీ సమస్యపై ఓ మహిళ, ఆమె పొరిగింటి వ్యక్తికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆ వ్యక్తి కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగుల్లో ఉన్న ఆ మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.