పెళ్లి కోసం సాహసం.. థర్మకోల్ షీట్‌తో వరదలో 7కి.మీ జర్నీ! - థర్మకోల్ షీట్‌తో నీటిలో 7కిమీ ప్రయాణం
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే హడ్గావ్ మండలం కొర్రి గ్రామానికి చెందిన ఓ వరుడు తన పెళ్లి కోసం సాహసం చేశాడు. థర్మకోల్ షీట్ సాయంతో 7 కిలోమీటర్ల దూరంలోని ఉమర్‌ఖేడ్ మండలం సంగమ్ చించోలి వరకు నీటిలో ప్రయాణించాడు. అతడితో పాటు బంధువులు సైతం థర్మకోల్ షీట్ల సాయంతోనే వివాహానికి వెళ్లారు.