పాపం గజరాజులు.. నదిలో చిక్కుకొని.. బయటకు రాలేక.. - మహనదిలో ఏనుగులు
Two Elephant stucked Mahanadi: ఒడిశాలోని బంకి అటవీపరిధిలో ప్రవహిస్తున్న మహనదిలో రెండు ఏనుగులు ఇరుక్కుపోయాయి. అత్‌ఘర్ సుఖసేన్ అటవీప్రాంతం నుంచి చందక-దంపదా అభయారణ్యంలోకి తిరిగి వెళ్లేందుకు నదిని దాటేందుకు ప్రయత్నించే క్రమంలో గజరాజులు చిక్కుకుపోయాయి. వాటిని గమనించిన స్థానికులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఏనుగుల సంచారంపై నిఘా పెట్టారు.