తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆటోడ్రైవర్​ను వెంటాడిన మృత్యువు.. లారీ టైర్​ ఢీకొని దుర్మరణం - tamilnadu news

By

Published : Jun 7, 2022, 11:35 PM IST

వేగంగా దూసుకొచ్చిన లారీ టైరు ఢీకొనడం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్​లో వెలుగుచూసింది. చనిపోయిన వ్యక్తి స్థానికంగా నివసించే మురళీ అనే ఆటో డ్రైవర్​గా గుర్తించారు పోలీసులు. కిరాణా కొట్టులో సామాను కొనుక్కుని రోడ్డు పక్కన నడుస్తుండగా వెనుకనుంచి మెరుపువేగంతో వచ్చిన టైరు ఢీకొట్టింది. మే1 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీల్లో రికార్డ్​ అయిన ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయింది. మురళి చికిత్స పొందుతూ మే5న కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్​ను అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details