'వరుణ దేవా.. కరుణించవా'.. పొలంలో రైతు కన్నీరుమున్నీరు - బిహార్ కరవు
Farmer Crying Video: బిహార్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల ఆ రాష్ట్ర అన్నదాతలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. సరైన వానలు కురవకపోవడం వల్ల.. తాము పండించిన వరి పంటపై దిగులు చెందుతున్నారు. 'వరుణ దేవా.. కరుణించవా' అంటూ ఆకాశంవైపు చూస్తూ కాలాన్ని గడుపుతున్నారు. తాజాగా తన పొలంలోనే ఓ రైతన్న కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోలో ఏడుస్తున్న రైతు.. ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వరిని పండిస్తారు బిహార్ రైతులు.