ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న వానరం.. వీడియో వైరల్ - బిహార్ వార్తలు
బిహార్‌లోని రోహ్తాస్ జిల్లా షాజుమా ప్రాంతంలో విచిత్ర ఘటన జరిగింది. స్థానికంగా ఉండే డాక్టర్ ఎస్ఎం అహ్మద్ క్లినిక్‌లోకి చికిత్స కోసం ఓ కోతి తన పిల్లతో పాటు వచ్చింది. అంతేకాదు.. ఆ రెండు వానరాలకు అహ్మద్ చికిత్స కూడా అందించారు. ఎక్కడో ఎత్తు నుంచి కిందపడటం వల్ల గాయపడ్డ వానరాలు.. అహ్మద్‌ను ఆశ్రయించాయి. కోతి తన పిల్లతో పాటు కుర్చీలో కూర్చొని అహ్మద్ దగ్గర చికిత్స తీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకోవాలనే ఆ కోతి తెలివితేటలను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.