తెలంగాణ

telangana

ETV Bharat / videos

మనుషుల్ని చంపి.. మామిడి చెట్టెక్కి నిద్రిస్తున్న చిరుత.. భయంభయంగా జనం - మనుషుల్ని చంపుతున్న చిరుత

By

Published : Jun 22, 2022, 9:51 AM IST

Alipurduar Leopard: ఓ చిరుత నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ.. మామిడి చెట్టుపై నిద్రిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటవీ, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చి చిరుతను పట్టుకెళ్లారు. ఈ ఘటన బంగాల్​ అలీపుర్​ద్వార్​ జిల్లాలోని షిల్బరీహట్​ ఘాట్​పడ్​ ప్రాంతంలో జరిగింది. కొద్దిరోజులుగా చిరుత ప్రజల్ని వేటాడుతుందని గ్రామస్థులు తెలిపారు. కొందరు అదృశ్యమవగా.. మరికొందరు గాయపడినట్లు పేర్కొన్నారు. మంగళవారం.. రబియుల్​ మియాన్​ అనే వ్యక్తి ఇంటిపక్కన మామిడి చెట్టుపై చిరుత నిద్రిస్తుండటం చూసి అధికారులకు సమాచారం అందించారు. దాన్ని ప్రశాంతపర్చేందుకు రెండు ట్రాంక్విలైజర్​ షాట్స్​ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. చిరుతను మళ్లీ అడవిలోకి వదిలిపెడతామని చెప్పారు అటవీ సిబ్బంది.

ABOUT THE AUTHOR

...view details