తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైగర్​ సినిమాతో ఆ కోరిక తీరిందన్న విజయ్ దేవరకొండ - విజయ్​ దేవరకొండ లైగర్​ సినిమా

By

Published : Aug 15, 2022, 5:58 PM IST

Vijay Devarkonda Liger Movie: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన పాన్​ ఇండియా చిత్రం 'లైగర్‌'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో దూకుడు పెంచిన 'లైగర్‌' టీమ్​ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది. తాజాగా హైదరాబాద్​లో లైగర్​ హీరోహీరోయిన్లు ప్రెస్​మీట్​ నిర్వహించారు. దేశవ్యాప్తంగా లైగర్​ సినిమా ఓ సంచలనం సృష్టిస్తుందని విజయ్ దేవరకొండ అన్నారు. దేశవ్యాప్తంగా తనపై యువత చూపిస్తోన్న ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేనని, అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందన్నారు. అయితే ఈ చిత్రంతో తనకు ఉన్న ఓ కోరిక తీరందని విజయ్ తెలిపారు. అదేంటో ఆయన మాటల్లోనే..

ABOUT THE AUTHOR

...view details