నడిరోడ్డుపై పోలీసుల కొట్లాట.. విధుల నుంచి తొలగింపు - Rampura police station area
హోంగార్డ్, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జగమ్మన్పుర్ పోలిస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మద్యం విషయమై ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో మాటలు కాస్తా కొట్లాటకు దారీతీశాయి. వీడియో వైరల్‌గా మారడంతో అధికారుల దృష్టికి చేరింది. ఆగ్రహించిన అధికారులు ఇరువురిని విచారించారు. కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేశారు.