Viral Video: ఫుల్లుగా తాగాడు.. బౌన్సర్‌ను కారుతో ఢీకొట్టాడు... ఇదిగో ఫుటేజీ! - Jublihills car accident
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఓ వ్యక్తి పూటుగా మద్యం సేవించి కారుతో బౌన్సర్‌ను ఢీకొట్టాడు. అంతకముందు ఆ వ్యక్తి బ్రాడ్వే పబ్‌లో మద్యం సేవించినట్లు తెలుసుస్తోంది. తీవ్ర గాయాలైన బౌన్సర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడితో పాటు అతను నడిపిన కారు కోసం గాలిస్తున్నారు.