తెలంగాణ

telangana

ETV Bharat / videos

మూడు బైక్​లపైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి - కేరళ న్యూస్​

By

Published : Jun 6, 2022, 11:04 PM IST

కేరళలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వయనాడ్‌ జిల్లాలోని పనమరంలో అదుపు తప్పిన కారు.. మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న కారు.. ముందుగా రెండు బైక్‌లను ఢీకొని ముందుకు దూసుకు వెళ్లింది. చివరగా ఓ ఇంటి ప్రహరీ గోడను బలంగా తాకింది. ఆగిపోయేలోపు పక్కనే ఉన్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. కారు డ్రైవర్‌తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details