ఉపరాష్ట్రపతిగా చివరి రోజు.. తరాలపాటు గుర్తుండే పని చేసిన వెంకయ్య! - venkaiah naidu recent news
మొక్కలు నాటేందుకు, పరిరక్షించేందుకు అందరూ చొరవ చూపాలని కోరారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పార్లమెంటులో 'సీత అశోక' మొక్కను నాటారు వెంకయ్య. భారతీయ సంప్రదాయంలో చెట్ల ప్రాముఖ్యాన్ని గుర్తుచేశారు. ఒక్క చెట్టు.. అనేక మంది పుత్రులకు సమానమన్న పురాణ పురుషుల వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.