భక్తుల పైనుంచి దూసుకెళ్లిన వాహనం.. గుడి వద్ద నిద్రిస్తుండగానే - భక్తుల పైనుంచి దూసుకెళ్లిన వాహనం
కర్ణాటక కొప్పల్లో ఘోర ప్రమాదం జరిగింది. హుళగెమ్మ దేవి మందిరం ఆవరణలో నిద్రిస్తున్న భక్తుల పైకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతుడిని బళ్లారికి చెందిన తిప్పన్న(75)గా గుర్తించారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో సహా పరార్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.