సమాజ్‌వాదీ నేత కారును ఢీకొట్టిన ట్రక్కు... 500 మీటర్లు లాక్కెళ్లి.. చివరకు.. - సమాజ్‌వాదీ పార్టీ
ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ మెయిన్‌పురి జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టి.. 500 మీటర్లు లాక్కెళ్లింది. అయితే దేవేంద్ర త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మెయిన్‌పురి సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో దేవేంద్ర సింగ్ ఫిర్యాదు చేయగా ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని మెయిన్‌పురి ఎస్పీ కమలేశ్ దీక్షిత్ తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.