కారులోని సోదరులపై తూటాల వర్షం.. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే.. - కాల్పుల కలకలం
Firing in Subhash Nagar Delhi: దిల్లీలో అంతా చూస్తుండగానే.. ముగ్గురు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. సుభాష్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు కారులో వెళుతుండగా కొందరు తుపాకులతో విరుచుకుపడ్డారు. భారీగా ట్రాఫిక్ ఉన్న సమయంలో దాడి చేయగా.. కారులో ఉన్న వారు తప్పించుకునేందుకు వాహనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. అయినా వాహనాన్ని వెంబడించి మరీ 10 రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు వీటి ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు. పాత కక్షలే కాల్పులకు కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.