తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇద్దరు పిల్లల్ని రైలులో నుంచి తోసేసి, దూకిన మహిళ.. లక్కీగా... - Ujjain railway station woman jump with two children

By

Published : May 15, 2022, 3:50 PM IST

హడావుడిలో ఓ మహిళ.. తనతోపాటు ఇద్దరు పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలో పడేసింది. అదృష్టంకొద్దీ పోలీస్ కానిస్టేబుల్​ సమయస్ఫూర్తితో ముప్పు నుంచి తప్పించుకుంది. మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని రైల్వే స్టేషన్​లో శనివారం జరిగిందీ ఘటన. జయపుర్​-నాగ్​పుర్​ రైలు కదులుతుండగానే.. ఓ మహిళ తన ఇద్దరు పిల్లల్ని ప్లాట్​ఫాంపైకి తోసేసింది. వెంటనే ఆమె కూడా దూకింది. పిల్లలు రైలుకు కాస్త దూరంగా పడినా.. ఆమె మాత్రం నియంత్రణ కోల్పోయింది. దాదాపుగా రైలు కిందకు వెళ్లిపోయినంత పనైంది. క్షణాల వ్యవధిలోనే ఈ ముగ్గురినీ కాపాడారు ఓ పోలీస్ కానిస్టేబుల్. తాము ఎక్కిన రైలు సీహోర్​లో ఆగదని తెలిసి ఆమె ఇలా చేసిందని అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details