జలపాతం వద్ద పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన ముగ్గురు మహిళలు! - tamilnadi courtallam waterfall
తమిళనాడు.. తెన్కాశిలో ఉన్న కుర్తాళం జలపాతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గత కొద్దిరోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు మృతదేహాల్ని వెలికితీశారు. మరో మహిళను కాపాడారు. అదే సమయంలో కొందరు పర్యటకులు.. ప్రమాద దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.