భారీ వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన రెండు ఆవులు - వరదలో కొట్టుకుపోయిన రెండు ఆవులు
ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మూగజీవుల పాలిట శాపంగా మారాయి. దెహ్రాదూన్‌లో అనేక చోట్ల రహదారులపై భారీగా వరద నీరు చేరి నదులను తలపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లాలో తెలియని తరుణంలో రోడ్లపైకి వచ్చే పశువులు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. చంద్రబని చోయిలా ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న రెండు ఆవులు క్షణాల్లో వరదలో కొట్టుకుపోయాయి.