పులి కోసం ట్రాఫిక్ నిలిపివేసిన అధికారులు.. తర్వాత దర్జాగా..! - Saigata nEWS
Traffic Stopped For Tiger: పులి కోసం ట్రాఫిక్‌ను నిలిపివేశారు అటవీ శాఖ అధికారులు. మహారాష్ట్ర చంద్రపుర్లోని నాగ్‌భీడ్- బ్రహ్మపురీ హైవేపై రెండు రోజుల క్రితం కనిపించిందీ సన్నివేశం. భారీ ట్రాఫిక్ ఉన్న కారణంగా.. రోడ్డు దాటలేక పులి అక్కడే పక్కన కూర్చుంది. అదే సమయంలోనే కొందరు.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది.. ట్రాఫిక్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం.. పులి అక్కడినుంచి లేచి దర్జాగా రోడ్డు దాటుకుంటూ వెళ్లిపోయింది. కొందరు వాహనాదారులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అవుతోంది.