వరదలో కొట్టుకుపోయిన ట్రాక్టర్- ఐదుగురు గల్లంతు - flood video 2022
వాగు దాటుతుండగా నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి ట్రాక్టర్ కొట్టుకుపోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్ర అమరావతి జిల్లా నంద్‌గావ్ ఖండేశ్వర్ మండలం జావ్రా మోల్వాన్లో జరిగిందీ ఘటన. వంతెన లేని ఈ ప్రాంతంలో ట్రాక్టర్‌తో వాగు దాటడం ఇక్కడి వారికి అలవాటే. అయితే.. సోమవారం అలానే చేస్తుండగా ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. వాగు మధ్యలో ట్రాక్టర్ ఆగిపోయింది. కాసేపటికే వాహనంతోపాటు దానిపై ఉన్న ఐదుగురు నీటిలో కొట్టుకుపోయారు.