ఆటో, క్యాబ్, లారీల బంద్ ప్రభావం... రవాణా రంగంపై ఎలా ఉండనుంది? - బంద్ ప్రభావం
Prathidwani: సమస్యల పరిష్కారమే అజెండాగా.. ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో, క్యాబ్, ట్రాలీ, లారీల డ్రైవర్లు. బంద్‌తో పాటు ట్రాన్స్‌పోర్ట్ ప్రధాన కార్యాలయం ముట్టడికీ కార్యాచరణ ప్రకటించారు. నూతన మోటారు వాహనచట్టం ప్రకారం అపరాధ రసుం వసూలు చేయడం తగదని... పెట్రో, డీజిల్ ధరల్ని తక్షణం జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. ఈ బంద్ ప్రభావం రవాణ రంగంపై ఎలా ఉండనుంది? జేఏసీ ప్రధాన డిమాండ్లతో పాటు.. రవాణ రంగం కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.