PRATHIDWANI : 'అగ్నిపథ్' సైనికోద్యోగాలు ఎందుకు వివాదాస్పదం అయ్యాయి? - అగ్నిపథ్ వివాదంపై నేటి ప్రతిధ్వని
PRATHIDWANI: దేశభక్తి, అంకితభావం తొణికిసలాడే సైనిక ఉద్యోగాలు సహజంగా యువతలో ఆత్మవిశ్వాసం పెంచుతుంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ సైనికోద్యోగాలు ఇప్పుడు దేశంలో మంటలు రేపాయి. రాజస్థాన్ నుంచి బిహార్ వరకు, దిల్లీ నుంచి తెలంగాణ వరకు సైనిక అభ్యర్థుల ఆందోళనలతో రైల్వే స్టేషన్లు అట్టుడుకుతున్నాయి. నిరసనకారులపై పోలీసులు జరుపుతున్న కాల్పులు, లాఠీచార్జీలతో రైలు పట్టాలు రక్తసిక్తమవుతున్నాయి. అసలు ఒక్కసారిగా అగ్నిపథ్ సైనికోద్యోగాలు ఎందుకు వివాదాస్పదం అయ్యాయి? నాలుగేళ్ల స్వల్పకాలిక సైనికులతో దేశానికి లభించే రక్షణ ఎంత? నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలు చల్లార్చే మార్గం ఏంటి? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.