రూపాయి పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థపై పడే దుష్ప్రభావాలేంటీ? - -ధరల పెరుగుదలను నియంత్రించే మార్గాలేంటి
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ఠానికి చేరింది. ఫలితంగా క్షీణించిన రూపాయి విలువ సామాన్యులపై ధరల భారం మోపనుంది. అంతర్జాతీయంగా డాలర్ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఏడాది కాలంగా రూపాయి విలువ దిగజారుతూనే ఉంది. ఎగుమతుల కన్నా, దిగుమతులపై అధికంగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థపై రూపాయి పతనం చూపించే దుష్ప్రభావం ఏంటి? విదేశీ మారక నిల్వలు తరిగిపోతే ఎదురయ్యే ఇబ్బందులేంటి? ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదలను నియంత్రించే మార్గాలేంటి? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని..