నోటికాడికొచ్చిన ముద్ద నీటిపాలయ్యే... ఏటా రైతుకు ఈ కష్టమెందుకు? - రైతు నోటికాడికొచ్చిన ముద్ద వానపాలై పోయింది
Prathidwani: రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట వానకు తడిసింది. నూర్పిడి చేసి కల్లాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం కుప్పలు వాననీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ట్రాక్టర్లలో, లారీల్లో మార్కెడ్ యార్డులకు తరలించిన ధాన్యం బస్తాలు సరైన రక్షణలేక నీళ్లలో మునిగి పోయాయి. చాలాచోట్ల ఐకేపీ కేంద్రాల్లో తూకానికి సిద్ధం చేసిన ధాన్యం వర్షం దెబ్బకు పాడైపోయింది. రైతు నోటికాడికొచ్చిన ముద్ద వాననీటి పాలైపోయింది. అసలు ఏటా రైతుకు ఈ కష్టం ఎందుకు? పొలం నుంచి మార్కెట్ వరకు తెచ్చిన పంట ఎందుకు నేలపాలై పోతోంది? ముందుగానే సమగ్ర సమాచారం అందుబాటులో ఉన్నా యార్డుల్లో పంట అమ్ముకునేందుకు నిరీక్షించాల్సిన పరిస్థితికి కారణమేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.