చిరుతను వేటాడి పీక్కుతింటున్న అడవి పందులు.. వీడియో వైరల్! - మూడు అడవి పందులు కలిసి చిరుతపై దాడి
THREE WILD BOAR HUNTING GULDAR: మూడు అడవి పందులు కలిసి ఓ చిరుతపై దాడి చేశాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మూడు పందులు ఒకేసారి దాడి చేయడంతో చిరుత నిస్సహాయ స్థితిలోకి వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. పందుల బారి నుంచి తప్పించుకునేందుకు చిరుతు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈటీవీ భారత్ ఈ వీడియోను ధ్రువీకరించలేదు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో కోట్ద్వార్- పౌడీ జాతీయ రహదారిపై జరిగినట్లు తెలుస్తోంది.