నిద్రిస్తున్న భార్యను లేపి, రైలు కిందకు తోసి హత్య
ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్న తన భార్యను నిద్ర లేపి అతి కిరాతకంగా పట్టాలపైకి తోసేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. వాసాయ్ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో ఒక వ్యక్తి నిద్రిస్తున్న తన భార్యను లేపి, అప్పుడే వస్తున్న ఎక్స్‌ప్రెస్ మెయిల్ ట్రైన్ కిందకు హఠాత్తుగా తోశాడు. రైలు కింద పడ్డ ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలను తీసుకుని పరారయ్యాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. నిందితుడ్ని పోలీసులు ఠానేలో అరెస్టు చేశారు. కుటుంబ కలహాలతోనే ఇలా చేశాడని ప్రాథమికంగా నిర్ధరించారు.