అక్కడ అంత్యక్రియలు చేయాలంటే.. నదిలో శవాన్ని మోసుకెళ్లాల్సిందే!
గుజరాత్లోని భరూచ్ జిల్లా.. దెహలీ ప్రజలు తమ గ్రామంలో మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు జరపడానికి నానాపాట్లు పడుతున్నారు. గ్రామ పరిసరాల్లో ప్రవహిస్తున్న కిమ్ నదికి అవతలి వైపు గ్రామానికి సంబంధించిన స్మశాన వాటిక ఉంది. దీంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మృతదేహాన్ని అందరూ గట్టిగా పట్టుకుని భయంభయంగా నదిని దాటుతున్నారు. అయితే నదీ ప్రవాహంపై వంతెన నిర్మించాలని ఇప్పటికే అనేక సార్లు అధికారులను విన్నవించినప్పటకీ ఎవరూ పట్టించుకోవట్లేదని అంటున్నారు గ్రామ ప్రజలు. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.