వరదలో బైక్‌తో సహా చిక్కుకున్న వ్యక్తి.. కాపాడిన పోలీసులు.. సీపీ అభినందనలు
వరదలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన కానిస్టేబుళ్లను హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. మంగళవారం వరదలో కొట్టుకుపోతున్న యువకుడిని రాజేంద్రనగర్ ట్రాఫిక్‌పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేగ్, డ్రైవర్ మల్లాంగ్ షా, విజయ్, రాకేశ్ కాపాడారు. మంగళవారం హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో రోడ్డుపై వెళ్తున్న వరద ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు కాపాడారు. రాజేంద్ర నగర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వరద ప్రవాహ ఉద్ధృతిని అంచనావేయకుండా ముందుకుసాగాడు. దీంతో ఇరుక్కుపోవడంతో... గమనించిన ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని అతన్ని కాపాడారు. బైక్‌ను కూడా పక్కకు తీసుకెళ్లారు.