అయ్యో పాపం... నీళ్లు తాగేందుకు వచ్చి... కొట్టుకుపోయిన 44 గేదెలు - నీళ్లు తాగేందుకు వచ్చి కొట్టుకుపోయిన 44 గేదెలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట వరద కాల్వలో గేదెలు గల్లంతయ్యాయి. ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి ముందస్తు సమాచారం లేకుండా వరద కాల్వకు అధికారులు నీళ్లు వదిలారు. ఇదే క్రమంలో నీటి కోసం కాల్వలోకి దిగిన 44 గేదెలు.... ఒక్కసారిగా వచ్చిన ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి నీటిని వదిలిన విషయం రైతులకు తెలియకపోవటంతో.... పశువులను కాల్వలోకి విడిచిపెట్టారు. అప్పటిదాకా పశువులను మేపుతున్న కాపరులు.... నీటి ప్రవాహానికి గేదెలు కొట్టుకుపోతుండటంతో తలలు బాదుకున్నారు.
TAGGED:
SRSP canal latest news