ఎస్సారెస్పీ 15 గేట్లు ఎత్తివేత.. ఎగిసిపడుతున్న గోదారి పరవళ్లు - శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
SRSP Gates Open: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో.. దిగువకు నీటి విడుదల కూడా కొనసాగుతోంది. ఏకంగా 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో.. గోదావరి పరవళ్లతో ప్రాజెక్టు ప్రాంతం సుమనోహరంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 60 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1081 అడుగుల మట్టానికి నీరు చేరింది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 90 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 76 టీఎంసీలకు నీరు చేరింది. దీంతో.. 15 వరద గేట్ల ద్వారా 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పైకి పర్యాటకుల వాహనాలను అనుమతించడం లేదు.