సైన్యం ఎంట్రీతో శ్రీలంక లైన్ క్లియర్! లగ్జరీ కార్లు సేఫ్.. ప్రధాని కుర్చీకి కాపలా!! - lanka army provides security at PM office
Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. చాలా మంది ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలోనే ఉన్నారు. మరోవైపు.. హింసాయుత నిరసనల కట్టడికి లంక సైన్యం రంగంలోకి దిగింది. పార్లమెంటు పరిసరాల్లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. కొలంబో రోడ్లపైనా ఆర్మీ వాహనాలతో గస్తీ కాస్తోంది. మరోవైపు.. ప్రధాని రణిల్ విక్రమసింఘే నివాసానికి కూడా భద్రతను పెంచింది. నలువైపులా పటిష్ఠ బందోబస్తుతో పాటు ప్రధాని కుర్చీకి కూడా గార్డులను కాపలాగా ఉంచింది. ప్రధాని నివాసంలోని లగ్జరీ కార్లన్నీ సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.