రెండు బైక్లను బలంగా ఢీకొట్టిన స్కార్పియా.. బంపర్లో బైకర్ ఇరుక్కుని.. - maharastra terrible accident
Horrific Accident: మహారాష్ట్రలోని కార్వే గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న ఓ స్కార్పియో.. రెండు బైక్లను బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ బైకర్.. ద్విచక్రవాహనంతో పాటు స్కార్పియో బంపర్ కింద ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన స్కార్పియో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.