టేస్టీ సోయా దోశ.. ఎముకలకు బలం.. గుండె జబ్బులకు చెక్! - సోయా దోశ తయారీ విధానం
Soya Dosa recipe: ఇంట్లో అందరూ ఇష్టంగా తినే అల్పాహారం దోశ. మరి దీన్ని ఇంకొంచెం రుచికరంగా, ఆరోగ్యకరంగా ఎందుకు మార్చకూడదు? అందుకే ఓసారి సోయా దోశ ట్రై చేసి చూడండి. సోయాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఎముక ఆరోగ్యాన్ని పెంచడం సహా గుండె సంబంధిత సమస్యలను దూరం చేసేందుకు సోయ ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న సోయాను దోశలా చేసుకొని ఇష్టంగా తినేయండి.