కలెక్టరేట్లో బుసలు కొట్టిన నాగుపాము.. మీరే చూడండి! - వనపర్తి జిల్లా కలెక్టరేట్
snake disturbance in Vanaparthi District Collectorate వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాగుపాము కలకలం సృష్టించింది. రూమ్ నంబర్ 10 వద్ద కలెక్టరేట్ సిబ్బందికి పాము బుసలు కొడుతూ కన్పించింది. వెంటనే విషయాన్ని స్నేక్ సొసైటీ నిర్వహకుడికి తెలియజేశారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కృష్ణసాగర్... పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో నాగుపాము బుసలు కొడుతూ మనుషుల మీదకు వస్తుండడంతో సిబ్బంది... భయాందోళనకు గురయ్యారు. చివరకు స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని అడవిలో వదిలేయడంతో... ఊపిరి పీల్చుకున్నారు.