తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరద నీటిలో బోల్తాపడ్డ స్కూల్​ బస్సు.. 8 మంది విద్యార్థులు! - వరదనీటిలో చిక్కుకున్న బస్సు

By

Published : Jul 8, 2022, 9:20 AM IST

Updated : Jul 8, 2022, 9:34 AM IST

School Bus Drowned: రుతుపవనాల ప్రభావంతో దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్​లోని జామ్​నగర్​ జిల్లాలో కూడా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని నానా వడాల గ్రామంలో గురువారం ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. వరద నీటి ప్రవాహంలో బోల్తా పడి చిక్కుకుపోయింది. వెంటనే గమనించిన గ్రామస్థులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సహాయంతో బస్సులో ఉన్నవారిని కాపాడారు. ఘటనా సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, డ్రైవర్​ ఉన్నట్లు చెప్పారు.
Last Updated : Jul 8, 2022, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details