పిల్లల నృత్యాలు.. మురిసిన తల్లిదండ్రులు - alforase zennext school
కరీంనగర్లోని అల్ఫోరేస్ జెన్నెక్ట్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని కవి బాల గంగాధర్ శాస్త్రి, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆధునిక, సాంప్రదాయ గీతాలకు విద్యార్థులు నృత్యాలతో అలరించారు. తమ పిల్లల నృత్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు.